Raviteja Movie with Karthik Ghattamaneni: దర్శకుడిగా ఫ్లాప్.. సినిమాతోగ్రాఫర్ గా హిట్టు.. అనూహ్యంగా అవకాశం ఇచ్చిన రవితేజ!
Raviteja Agreed a Movie with Cinematographer Karthik Ghattamaneni as Director: రవితేజ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Raviteja Agreed a Movie with Cinematographer Karthik Ghattamaneni as Director: ఈ మధ్యకాలంలో సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారుతున్న దాఖలాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే గుహన్, అంజి లాంటి చాలా మంది సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాటోగ్రాఫర్ గా సూపర్ హిట్లు అందుకున్న కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మాత్రం హిట్ కొట్టలేక పోయాడు. కార్తీక్ గతంలో ఒక సినిమా చేశారు. ఆ సినిమా కలిసి రాలేదు కానీ ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ కార్తికేయ సినిమాతో హిట్ అందుకున్నారు.
తర్వాత ఒకే ఏడాదిలోనే సూర్య వర్సెస్ సూర్య అంటూ నిఖిల్ తో ఒక సినిమా దర్శకుడిగా ప్లాన్ చేశారు. అదే సినిమాకు దర్శకుడిగా- సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన కార్తీక్ ఆ సినిమాతో మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ప్రేమమ్, ఎక్స్ప్రెస్ రాజా, నిన్ను కోరి, రాధా, కృష్ణార్జునయుద్ధం, చిత్రలహరి, డిస్కో రాజా, బ్లడీ మేరీ, కార్తికేయ 2, ధమాకా వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక కార్తికేయ సినిమాకు అయితే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తూనే ఎడిటర్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఇప్పుడు తాజా సమాచారం ఏమిటి అంటే రవితేజకు కార్తీక్ ఘట్టమనేని ఒక కథ చెప్పారని ఆ కథ రవితేజకు బీభత్సంగా నచ్చడంతో దానికాయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ధమాకా షూట్ సమయంలో ఇద్దరి మధ్య మంచి ర్యాపొ ఏర్పడిందని అంటున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాగా ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లో జరిపే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇక ఈ సినిమాకు ఈగల్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రవితేజ క్రాక్ సినిమాతో హిట్టు అందుకుని తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా నిరాశ పరిచాయి. ఇక ఇవి కాకుండా ఆయన నటిస్తున్న పలు సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.
Also Read: Dasara Movie Release Date: సిల్క్ స్మిత సాక్షిగా 'దసరా' రిలీజ్ డేట్ చెప్పేసిన నాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి